Header Banner

శ్రీవారి భక్తులను మోసగించిన ట్రావెల్ ఏజెంట్..! లక్షలు వసూలు చేసి..!

  Fri May 16, 2025 10:25        Others

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పిస్తామని బురిడీ కొట్టించే వారు రోజుకొకరు పెరిగిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టిన సమయం నుంచి అధికారులు కేటుగాళ్ల భరతం పడుతున్నారు. భక్తుల ఫిర్యాదుల మేరకు అనతి కాలంలోనే పలువురిని విజిలెన్స్ పోలీసులు పట్టుకున్నారు. టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్లు మాత్రం భక్తుల అమయాకత్వాన్ని క్యాష్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా శ్రీవారి దర్శనం పేరిట భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ శ్రీవారి భక్తులను మోసగించాడు. ప్రత్యేక దర్శనం కల్పిస్తామని చెప్పి.. 36 మంది భక్తులు వద్ద లక్షా 25 వేలు వసూలు చేశాడు. భక్తులకు నకీలి టిక్కెట్లు ఇచ్చి దర్శనంకు వెళ్లమని చెప్పాడు.

ఎంతో సంతోషంగా వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు షాక్ తగిలింది. నకీలి టిక్కెట్లతో క్యూలైన్లలోకి వెళ్లిన 36 మంది భక్తులు.. తాము మోసపోయామని గ్రహించారు. ఏజెంట్పై పోలీసులకు భక్తులు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్స్ అన్ని నిండిపోయి.. వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63,208 మంది భక్తులు దర్శించుకోగా.. 32,951 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు అని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!

వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!


చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TTDScam #FakeDarshanTickets #TirumalaFraud #DevoteeScam #TTDNews #LordVenkateswara